subhodayam › జంతర్ మంతర్ లాఠీఛార్జ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఐదుగురు సభ్యుల కమిటీ… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

జంతర్ మంతర్ లాఠీఛార్జ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు

subhodayam
జంతర్ మంతర్ లాఠీఛార్జ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బలప్రయోగానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. తమ సమస్యలపై ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసులు క్రూరంగా వ్యవహరించడం విచారకరమని వ్యాఖ్యానించింది.

జంతర్ మంతర్ వద్ద జరిగిన పోలీసుల దాడి, పెల్లెట్ గుండ్ల ప్రయోగం, మహిళా నిరసనకారులపై జరిగిన దౌర్జన్యాలపై సమగ్ర విచారణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిరసనకారులు శాంతియుతంగా తమ సమస్యలను వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించడం సమర్థనీయం కాదని ధర్మాసనం పేర్కొంది. ఘటనకు బాధ్యులైన అధికారుల పాత్ర, పోలీసుల చర్యలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు విచారణ కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బలప్రయోగానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి…