subhodayam › ధోని రిటైర్ అవ్వగానే రైనా కూడా గుడ్‌బై.. అసలు కారణం… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

ధోని రిటైర్ అవ్వగానే రైనా కూడా గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

subhodayam
ధోని రిటైర్ అవ్వగానే రైనా కూడా గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరూ 2020 ఆగస్టు 15న ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అయితే ధోని రిటైర్‌మెంట్ ప్రకటించిన వెంటనే తాను కూడా ఎందుకు రిటైర్ అయ్యానో రైనా తాజాగా వెల్లడించాడు.

రైనా మాట్లాడుతూ.. క్రికెట్‌నే జీవితంగా భావించినప్పటికీ ఆ సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనిపించిందని చెప్పాడు. అప్పటికి తన వయసు 33 ఏళ్లు మాత్రమేనని, అయినప్పటికీ అదే సరైన నిర్ణయంగా భావించి రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు.

ధోని అధికారికంగా రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన వద్దకు వెళ్లి ‘అంతా అయిపోయింది’ అని చెప్పానని రైనా గుర్తుచేసుకున్నాడు. తన నిర్ణయం విని ధోని కూడా షాక్‌కు గురై ‘ఏం చేశావ్ నువ్వు?’ అని అడిగినట్లు చెప్పాడు.

“ధోని నా కోసం త్యాగం చేశాడు”

ధోని తన బ్యాటింగ్ స్థానాన్ని కూడా తన కోసం త్యాగం చేశాడని రైనా వెల్లడించాడు. సౌరభ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ధోని టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడని, ఆ తర్వాత యువరాజ్ సింగ్‌, తనను టాపార్డర్‌లో పంపించి ధోని ఫినిషర్‌గా మారాడని వివరించాడు.

తన సామర్థ్యాలపై ధోని తనకంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడని భావించానని రైనా చెప్పాడు. అందుకే జట్టులో తనకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

“మా స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది”

డబ్బు, విజయాల కంటే మన కోసం త్యాగం చేసే వ్యక్తుల విలువ గొప్పదని రైనా పేర్కొన్నాడు. ధోని తన కోసం ఎన్నో త్యాగాలు చేశాడని, తాను కూడా ఆ బంధానికి విలువ ఇవ్వాలని ఎప్పుడూ భావించానని చెప్పాడు.

మనసుతో ఏర్పడిన అనుబంధాలు జీవితాంతం కొనసాగుతాయని, తమ స్నేహంలో అలాంటి బంధమే ఉందని రైనా భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా ఉండే ఈ…