subhodayam › తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

subhodayam
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

వారాంతం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమల కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి.

టోకెన్లు లేని సాధారణ సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట రింగు రోడ్డు వరకు ఏర్పాటైన క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు క్యూలైన్ల వద్ద పాలు, తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు. రద్దీ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం ఒక్కరోజే 68,374 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 35,241 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.03 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

భారీ రద్దీ నేపథ్యంలో వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తమ తిరుమల ప్రయాణం, దర్శనాన్ని ముందుగానే తగిన జాగ్రత్తలతో ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

వారాంతం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమల కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠం…