subhodayam › పెళ్లికి ఒక్కరోజు ముందు విషాదం.. కాలువలో కాబోయే పెళ్లికొడుకు గల్లంతు › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

పెళ్లికి ఒక్కరోజు ముందు విషాదం.. కాలువలో కాబోయే పెళ్లికొడుకు గల్లంతు

subhodayam
పెళ్లికి ఒక్కరోజు ముందు విషాదం.. కాలువలో కాబోయే పెళ్లికొడుకు గల్లంతు

పెళ్లి ఇంట్లో బంధుమిత్రుల సందడి, ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన వేళ విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కాబోయే పెళ్లికొడుకు నీటి ప్రవాహంలో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కటకానిపల్లెలో జరిగింది.

కటకానిపల్లెకు చెందిన పుష్పాల రాజ్‌కుమార్‌ (23)కు ఈ నెల 7న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు, బంధువులు నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో రాజ్‌కుమార్ తన స్నేహితులు, బంధువులతో కలిసి మొత్తం ఏడుగురు గ్రామ సమీపంలోని వెలిగొండ ఫీడర్ కాలువ వద్దకు వెళ్లారు.

అక్కడ రాజ్‌కుమార్‌ (23), అతని స్నేహితుడు వినయ్‌కుమార్‌ (22), మరో స్నేహితుడు రాజు సరదాగా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగారు. అయితే శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో కాలువలో నీటి ప్రవాహం తీవ్రంగా ఉంది.

ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయకుండా నీటిలోకి దిగడంతో ముగ్గురూ అదుపుతప్పారు. రాజు ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, రాజ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కళ్ల ముందే స్నేహితులు గల్లంతవడంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెళ్లి పందిరి వద్ద ఆనందంగా ఉండాల్సిన కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బాధితుల ఫిర్యాదుతో యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గల్లంతైన రాజ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైన ఐదు రోజుల్లోనే ఇది రెండో ప్రమాదంగా అధికారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కాలువల వద్దకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదాలకు కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు.

పెళ్లి ఇంట్లో బంధుమిత్రుల సందడి, ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన వేళ విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కాబోయే పెళ్లికొడుకు నీటి ప్రవాహంలో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.…