subhodayam › ముంబై దహిసర్‌లో ఓ కారు బానెట్‌లో భారీ కొండచిలువ ప్రత్యక్షం › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

ముంబై దహిసర్‌లో ఓ కారు బానెట్‌లో భారీ కొండచిలువ ప్రత్యక్షం

subhodayam

ముంబైలో ఓ కారు బానెట్‌లో భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దహిసర్ వెస్ట్‌లోని కందర్‌ప్రాడ ప్రాంతంలో ఉన్న మహేశ్వర్ బిల్డింగ్ పార్కింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన కారులోకి పాము దూరడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. శనివారం సన్నీ కాంబ్లే అనే వ్యక్తి సోదరి కారును నివాస సముదాయంలో పార్క్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఓ భారీ పాము కారు కింది భాగం నుంచి నెమ్మదిగా బానెట్‌లోకి వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. అది సుమారు 7 అడుగుల పొడవున్న కొండచిలువ అని తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం భవనంలో వేగంగా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు.

నివాస ప్రాంతంలో కొండచిలువ స్వేచ్ఛగా తిరిగితే ప్రమాదమని భావించిన స్థానికులు వెంటనే వన్యప్రాణి సంరక్షణ నిపుణులకు సమాచారం అందించారు. రెస్క్యూ నిపుణుడు సమీర్ గుప్తా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన కారు బానెట్‌ను తెరవగా, ఇంజిన్ వద్ద కొండచిలువ చుట్టుకుని కనిపించింది. వెంటనే ఆయన అత్యంత చాకచక్యంగా దాన్ని బయటకు తీసి, ఒక సంచిలో బంధించారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.

అనంతరం ఆ కొండచిలువను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కారు ఇంజిన్ వేడికి దానికి ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత సమీపంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ముంబైలో ఓ కారు బానెట్‌లో భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దహిసర్ వెస్ట్‌లోని కందర్‌ప్రాడ ప్రాంతంలో ఉన్న మహేశ్వర్ బిల్డింగ్ పార్కింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.…