subhodayam › మహిళ కడుపులో 14 పెన్నులు.. 5 చెక్క చెంచాలు, కొవ్వొత్తి › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

మహిళ కడుపులో 14 పెన్నులు.. 5 చెక్క చెంచాలు, కొవ్వొత్తి

subhodayam
మహిళ కడుపులో 14 పెన్నులు.. 5 చెక్క చెంచాలు, కొవ్వొత్తి

నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన ఓ అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన 33 ఏళ్ల మహిళ కడుపులో భారీగా అసాధారణ వస్తువులు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వైద్యులు లాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స నిర్వహించి వాటిని విజయవంతంగా తొలగించారు.

పెటలూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల వివాహిత కొంతకాలంగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నొప్పి తీవ్రం కావడంతో శనివారం ఆమెను నరసరావుపేటలోని మాతాశ్రీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా.. ఆమె కడుపులో అసాధారణ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.

శస్త్రచికిత్సతో తొలగించిన వైద్యులు

పరీక్షల్లో కడుపులో 14 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం వైద్యులు లాప్రోస్కోపిక్‌ విధానంలో శస్త్రచికిత్స చేసి మొత్తం వస్తువులను బయటకు తీశారు.

వాటిలో ఓ పెన్నుకు క్యాప్ లేకపోవడంతో అది కడుపులో గుచ్చుకుని ఉండటం వల్ల నొప్పి, అసౌకర్యం కలిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఒకేసారి ఇన్ని వస్తువులు కడుపులోకి ఎలా వెళ్లాయన్నది తమకు కూడా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

పదేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో..

బాధితురాలి తండ్రి నోముల హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె గత పదేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆమె ప్రవర్తనలోనూ మార్పులు కనిపించేవని కుటుంబ సభ్యులు చెప్పారు.

అంతేకాకుండా ఆమె భర్త రెండు నెలల క్రితం విడాకులు ఇచ్చినట్లు తండ్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్సతో పాటు మానసిక ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణ కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన ఓ అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన 33 ఏళ్ల మహిళ కడుపులో భారీగా అసాధారణ…