subhodayam › నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నేతలు.. అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నేతలు.. అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత

subhodayam
నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నేతలు.. అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే బీఆర్‌ఎస్‌ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నల్ల షర్టులు, నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలను గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో నేతలు అక్కడే నిరసనకు దిగడంతో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో తన చీరను లాగారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తన కాలికి కూడా గాయమైందని, ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

అసెంబ్లీలోనే మహిళా ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే బయట మహిళలకు ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తుందని ఆమె ప్రశ్నించారు.

తమను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం వెనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే భయమే ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా, గేటు వద్ద జరిగిన తోపులాటలో కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డికి గాయాలైనట్లు బీఆర్‌ఎస్‌ నేతలు వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే బీఆర్‌ఎస్‌ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నల్ల షర్టులు, నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలను గేటు వద్ద పోలీసులు…