subhodayam › కొత్త పార్టీ పెట్ట‌డానికి ముందు ప్రజల సమస్యలు వివరిస్తానని వెల్ల‌డి › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

కొత్త పార్టీ పెట్ట‌డానికి ముందు ప్రజల సమస్యలు వివరిస్తానని వెల్ల‌డి

subhodayam
కొత్త పార్టీ పెట్ట‌డానికి ముందు ప్రజల సమస్యలు వివరిస్తానని వెల్ల‌డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా, అజెండాను ప్రకటించే ముందు, రాష్ట్రంలోని సమస్యలను ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. ఏపీకి ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం ఎంతో అవసరమని, ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తానని ఆయన తెలిపారు. విజయవాడలో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయం మొత్తం రెండు పార్టీల చుట్టూనే తిరుగుతోందని, వైసీపీ, టీడీపీల మధ్య ఫ్యాక్షన్ తరహా యుద్ధం జరుగుతోందని ఆరోపించారు. ఈ పార్టీలకు పోలీసులు కూడా మద్దతు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

టీడీపీ, వైసీపీలు ఫ్యాక్షన్ కుటుంబ రాజకీయ పార్టీలని విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఆరు కోట్ల ప్రజానీకం, రాష్ట్ర సంపదను ఏ పార్టీ దోచుకోవాలనే హక్కు కోసం ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. "ప్రజలకు గోరంత, తమకు కొండంత" అన్నట్లుగా ఈ పార్టీల తీరు ఉందని, అందుకే రాష్ట్రానికి మరో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా, అజెండాను ప్రకటించే ముందు, రాష్ట్రంలోని సమస్యలను ప్రజల…