subhodayam › అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన అధికారి › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన అధికారి

subhodayam
అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన అధికారి

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి వాకిటి శ్రీహరి మానవత్వం చాటుకున్నారు. నవీన్‌ మిట్టల్‌ పీఎస్‌ రాజు అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలడంతో మంత్రి వెంటనే స్పందించారు. ఆయనకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించిన మంత్రి.. రాజుకు వెంటనే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌ రప్పించి బాధితుడిని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసెంబ్లీ ఆవరణలో రాజు కుప్పకూలిన వెంటనే మంత్రి శ్రీహరి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వెంటనే స్పందించి సీపీఆర్‌ చేయడాన్ని అభినందిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి వాకిటి శ్రీహరి మానవత్వం చాటుకున్నారు. నవీన్‌ మిట్టల్‌ పీఎస్‌ రాజు అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలడంతో మంత్రి వెంటనే స్పందించారు. ఆయనకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు…