రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించలేక తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
బుధవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్.. తమ ఫొటోలను ఏఐ టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఫొటోల మార్ఫింగ్ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావుపై కేసుల వ్యవహారం కూడా కొనసాగుతోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీషర్ట్‌లు విప్పారంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు.