subhodayam › ఒకే రోజు.. రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు! › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

ఒకే రోజు.. రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!

subhodayam
ఒకే రోజు.. రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!

భారత క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 3న ఒకే రోజు రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత జట్టు ఫైనల్‌లో తలపడే అవకాశం ఉండగా.. అదే రోజు భారత్‌లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ జరగనుంది.

2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. భారత్ సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్‌తో టోర్నీలో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న ఫైనల్‌తో పాటు పతకాల కోసం ఇతర మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ ఫైనల్‌కు చేరితే అక్టోబర్ 3న స్వర్ణ పతకం కోసం పోరాడుతుంది.

ఇదే సమయంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ కూడా అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో జరగనుంది. దీంతో ఒకే రోజున రెండు వేర్వేరు దేశాల్లో రెండు భారత జట్లు బరిలోకి దిగే అరుదైన అవకాశం ఏర్పడింది.

ఆసియా క్రీడల కోసం అయ్యర్‌కు వన్డే సిరీస్ దూరం

ఆసియా క్రీడల్లో భారత పురుషుల టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 22 నాటికి జట్టుతో కలిసి అతను జపాన్ చేరుకోనున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు అయ్యర్ అందుబాటులో ఉండడు.

భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్.. ఆసియా క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు.

స్వర్ణంపై బీసీసీఐ అధ్యక్షుడి ధీమా

ఆసియా క్రీడలకు వెళ్తున్న భారత బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మనహాస్ శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణ పతకాలు సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల కఠోర శ్రమ, సన్నద్ధత, ఉత్సాహాన్ని చూస్తుంటే దేశం గర్వపడేలా వారు విజయాలు సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

భారత క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 3న ఒకే రోజు రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం…