subhodayam › రూ.3 లక్షల ఐఫోన్.. అదే డబ్బుతో రెండు దేశాలు చుట్టిరావచ్చు! › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

రూ.3 లక్షల ఐఫోన్.. అదే డబ్బుతో రెండు దేశాలు చుట్టిరావచ్చు!

subhodayam
రూ.3 లక్షల ఐఫోన్.. అదే డబ్బుతో రెండు దేశాలు చుట్టిరావచ్చు!

హైదరాబాద్: మీ చేతిలో రూ.3 లక్షలు ఉంటే ఏం చేస్తారు? ఓ మంచి కారుకు డౌన్‌పేమెంట్‌ కడతారా? కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తారా? లేక అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తారా? ప్రస్తుతం టెక్‌ ప్రపంచంలో ఈ ప్రశ్నకు కారణంగా నిలుస్తోంది యాపిల్‌ కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘ఐఫోన్‌ డ్యుయో’.

సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఫోన్‌ ధర టెక్‌ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో 256జీబీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.2,99,900గా ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ ఫోన్‌ ధరను విదేశీ పర్యటనల ఖర్చుతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

దుబాయ్‌, థాయ్‌లాండ్‌, బాలి, మారిషస్‌ వంటి దేశాలకు 6–7 రోజుల పర్యటనకు విమాన టికెట్లు, వీసా, హోటల్‌, ఆహారం, ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన ఐఫోన్‌ డ్యుయో బేస్‌ మోడల్‌ ధరతో రెండు అంతర్జాతీయ ట్రిప్పులు చేయొచ్చని నెటిజన్లు పోల్చుతున్నారు.

టాప్‌ ఎండ్‌ 2టీబీ మోడల్‌ ధర రూ.4,49,900 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ మొత్తంతో మరింత ఖర్చుతో కూడిన పలు విదేశీ పర్యటనలు చేయవచ్చనే చర్చ కూడా జరుగుతోంది.

అసలు ఐఫోన్‌ డ్యుయోలో ఏముంది?

ఫోల్డబుల్‌ డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో బయట 5.4 అంగుళాల డిస్‌ప్లే, ఫోన్‌ను తెరిచినప్పుడు 7.6 అంగుళాల ఇన్నర్‌ స్క్రీన్‌ ఉంటాయని సమాచారం.

యాపిల్‌ సొంత A20 Pro చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 2TB వరకు స్టోరేజ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉండనుందని చెబుతున్నారు. iOS 27 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మల్టీటాస్కింగ్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరిచినట్టు సమాచారం.

స్టార్‌ వైట్‌, నైట్‌ స్కై రంగుల్లో ఫోన్‌ అందుబాటులోకి రానుందని పేర్కొంటున్నారు.

అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధర ఎందుకు ఎక్కువ?

అమెరికాలో ఐఫోన్‌ డ్యుయో ప్రారంభ ధర 1,999 డాలర్లుగా ఉందని సమాచారం. భారత్‌లో మాత్రం కస్టమ్స్‌ డ్యూటీ, 18 శాతం జీఎస్టీ వంటి పన్నుల కారణంగా ధర గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు.

దీంతో భారత మార్కెట్లో ఈ ఫోన్‌ ధర అమెరికాతో పోలిస్తే భారీగా కనిపిస్తోంది. యాపిల్‌ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన ఐఫోన్లలో ఇది ఒకటిగా నిలవనుంది.

ఫోన్‌ కొనాలా.. ప్రపంచం చుట్టిరావాలా?

ఈ ఫోన్‌ ప్రీమియం ధరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అత్యాధునిక ఫోల్డబుల

హైదరాబాద్: మీ చేతిలో రూ.3 లక్షలు ఉంటే ఏం చేస్తారు? ఓ మంచి కారుకు డౌన్‌పేమెంట్‌ కడతారా? కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తారా? లేక అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు…