subhodayam › టోల్‌ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. ఫిబ్రవరి నుంచి… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

టోల్‌ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్‌

subhodayam
టోల్‌ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్‌

హైవేలపై టోల్‌ చెల్లింపుల్లో కీలక మార్పు రానుంది. ఇక వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్‌ విధానాన్ని తీసుకురానున్నారు. వచ్చే ఫిబ్రవరిలోగా ఈ విధానం అందుబాటులోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

ముంబైలో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026’లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌కు వాహన నంబర్‌ప్లేట్‌ గుర్తింపు సాంకేతికతను జోడించనున్నట్లు చెప్పారు. ఫాస్టాగ్‌, నంబర్‌ప్లేట్‌ రెండింటి సాయంతో వాహనాలను గుర్తించి టోల్‌ వసూలు చేస్తారు.

కొత్త విధానం వల్ల టోల్‌ వసూళ్లు ఏటా రూ.10 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని గడ్కరీ చెప్పారు. టోల్‌ చెల్లించేందుకు వాహనాలు ఆగకపోవడంతో ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు.

ఫాస్టాగ్‌ రాకతో టోల్‌ ప్లాజాల వద్ద వేచి చూసే సమయం ఇప్పటికే 80-90 శాతం తగ్గిందని మంత్రి చెప్పారు. గతంలో 12 నిమిషాల వరకు ఉండే నిరీక్షణ కొన్ని చోట్ల 30 నిమిషాలకు చేరేదన్నారు. ఇప్పుడు మిగిలిన ఆలస్యాన్ని కూడా సాంకేతికతతో తొలగించనున్నట్లు వివరించారు.

ఫాస్టాగ్‌ను 2016లో ప్రవేశపెట్టారు. 2021లో దేశవ్యాప్తంగా తప్పనిసరి చేశారు. వాహనం టోల్‌ ప్లాజాను దాటుతున్నప్పుడు ఫాస్టాగ్‌ ద్వారా అనుసంధానిత ఖాతా నుంచి రుసుము ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. నగదు చెల్లింపులతో పాటు చిల్లర కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోవడంతో టోల్‌ వసూళ్లు వేగంగా మారాయి.

ఇక తదుపరి దశలో టోల్‌ ప్లాజాల వద్ద అడ్డంకులే లేకుండా వాహనాలు నేరుగా వెళ్లేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

హైవేలపై టోల్‌ చెల్లింపుల్లో కీలక మార్పు రానుంది. ఇక వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్‌ విధానాన్ని తీసుకురానున్నారు. వచ్చే ఫిబ్రవరిలోగా ఈ విధానం…