subhodayam › ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న సీఎం.. ఎమ్మెల్యేల నుంచే అసహనం? › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న సీఎం.. ఎమ్మెల్యేల నుంచే అసహనం?

subhodayam
ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న సీఎం.. ఎమ్మెల్యేల నుంచే అసహనం?

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, గత మూడు రోజుల ఘటనలు ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకొచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం మీటింగ్‌ హాల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితులపై తాను చేయించిన ఫ్లాష్‌ సర్వేలో ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు తేలిందని సీఎం చెప్పినట్టు సమాచారం. ప్రజలు ఇచ్చిన పదవిని, బాధ్యతను సక్రమంగా వినియోగించుకోకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా రాణించడం కష్టమవుతుందని ఎమ్మెల్యేలకు సీఎం సూచించినట్టు తెలిసింది.

ఇదే సమయంలో శుక్రవారం 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో చర్చ చేపడదామని సీఎం చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న తప్పిదాలను గతంలోని ధరణి వ్యవస్థపై నెట్టివేయాలని సూచించినట్టు కూడా తెలుస్తోంది.

ప్రతిపక్షం కాదు.. ప్రభుత్వమే పలుచనైందన్న ఎమ్మెల్యేలు

అయితే సీఎం వ్యాఖ్యలపై మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గత మూడు రోజుల పరిణామాలతో ప్రతిపక్షం బలహీనపడలేదని, ప్రభుత్వం మరియు కాంగ్రెస్‌ పార్టీనే ప్రజల్లో పలుచనయ్యాయని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు తెలిసింది.

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసంపైకి దండయాత్రకు సంబంధించిన పరిణామాలు కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం చేశాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి, పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ ఇంటి

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, గత మూడు రోజుల ఘటనలు ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకొచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం.…