subhodayam › తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్.. ఇక పరీక్షతో పాటు… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్.. ఇక పరీక్షతో పాటు వీడియో కోర్సు!

subhodayam
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్.. ఇక పరీక్షతో పాటు వీడియో కోర్సు!

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో కీలక మార్పులు రానున్నాయి. రహదారి భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా రవాణా శాఖ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా రెండున్నర గంటల ఆన్‌లైన్ వీడియో కోర్సును పూర్తి చేసి, పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (LLR) చేసుకున్న ప్రతి అభ్యర్థి ఈ కోర్సును పూర్తి చేయాలి. రెండున్నర గంటల కోర్సును 25 నిమిషాల చొప్పున ఆరు మాడ్యూల్స్‌గా విభజించారు. ఇందులో 64 రహదారి భద్రతా నిబంధనలతో పాటు ప్రాక్టికల్ డ్రైవింగ్‌కు సంబంధించిన అంశాలను వివరించనున్నారు.

అభ్యర్థులు మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్ కోర్సును పర్యవేక్షించనున్నారు. ప్రతి మాడ్యూల్ అనంతరం క్విజ్ ఉంటుంది. ఆరు మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత తుది పరీక్ష నిర్వహిస్తారు.

తుది పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కూకట్‌పల్లిలో పైలట్ ప్రాజెక్ట్

ఈ విధానాన్ని ఇప్పటికే కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అక్కడ సుమారు 3,400 మంది LLR దరఖాస్తుదారుల్లో 2,800 మంది ఆన్‌లైన్ కోర్సును పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో మరో 30 నుంచి 45 రోజుల్లో కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

ఆస్ట్రేలియా, యూకే, అమెరికా తదితర దేశాల్లోని రహదారి భద్రతా విధానాలను పరిశీలించి ఈ కోర్సును రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వీడియో కోర్సు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో కీలక మార్పులు రానున్నాయి. రహదారి భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా రవాణా శాఖ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.…