subhodayam › తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్

subhodayam
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

అల్పపీడనం దక్షిణ ఒడిశా తీరం, వాయవ్య–పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ విదర్భ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్ష ప్రభావం తక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30–32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23–24 డిగ్రీల మధ్య ఉండొచ్చని అంచనా.

ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద ఉండకూడదని అధికారులు సూచించారు. రైతులు కూడా పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం…