subhodayam › తెలంగాణకు 2 లక్షల ఇళ్లు › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

తెలంగాణకు 2 లక్షల ఇళ్లు

subhodayam
తెలంగాణకు 2 లక్షల ఇళ్లు

ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద తెలుగు రాష్ట్రాలకు అదనంగా మరో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటికే కేటాయించిన ఇళ్లకు అదనంగా ఈ ఇళ్లను అందించనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించింది.

ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల్లోని ఇళ్లు లేని పేద కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత ఉన్న కుటుంబాలు సొంతింటి నిర్మాణానికి కేంద్రం అందించే సాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద భారీగా ఇళ్లను కేటాయించిన కేంద్రం.. తాజాగా మరో 5 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపింది. కొత్త కేటాయింపులతో మరింత మంది నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంది.

త్వరలో జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హతలు, ఎంపిక విధానం, లబ్ధిదారుల జాబితాకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించనున్నారు. అర్హత ఉన్న కుటుంబాలు ప్రభుత్వ ప్రకటనలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రు

ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద తెలుగు రాష్ట్రాలకు అదనంగా మరో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది.…