subhodayam › మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో అనుమతులు లేకుండానే షెడ్ నిర్మాణం? › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో అనుమతులు లేకుండానే షెడ్ నిర్మాణం?

subhodayam
మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో అనుమతులు లేకుండానే షెడ్ నిర్మాణం?

అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు

మేడ్చల్: మేడ్చల్ చెక్‌పోస్ట్ పరిధిలో భారీ షెడ్ నిర్మాణం జరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ.. ఈ నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఉన్నాయా? లేదా? అన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే మేడ్చల్ చెక్‌పోస్ట్ పరిధిలో జరుగుతున్న ఈ నిర్మాణంపై అధికారులు ఇప్పటివరకు పరిశీలన చేపట్టలేదని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. నిర్మాణానికి అనుమతులు ఉన్నట్లయితే వాటి వివరాలను, లేకపోతే నిబంధనల ప్రకారం తీసుకున్న చర్యలను అధికారులు స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు మేడ్చల్: మేడ్చల్ చెక్‌పోస్ట్ పరిధిలో భారీ షెడ్ నిర్మాణం జరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్మాణ…