subhodayam › భరత్ నాట్యం రివ్యూ.. ఆస్తి కోసం అన్న చేసిన పని… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

భరత్ నాట్యం రివ్యూ.. ఆస్తి కోసం అన్న చేసిన పని ఏంటంటే?

subhodayam
భరత్ నాట్యం రివ్యూ.. ఆస్తి కోసం అన్న చేసిన పని ఏంటంటే?

మలయాళ నటుడు సైజు కురుప్ విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ‘భరత్ నాట్యం’ 2024 ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తాజాగా సెప్టెంబర్ 10 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో భరత్ నాయుడు అనే వ్యక్తి పదవీ విరమణ తర్వాత కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. పెద్ద కొడుకు శశిధర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంటాడు. ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా మొదలవుతాయి.

అలాంటి సమయంలో భరత్ నాయుడికి గుండెపోటు వస్తుంది. పరిస్థితి విషమంగా ఉందని భావించిన ఆయన తన పెద్ద కొడుకు శశిధర్‌కు ఒక రహస్యాన్ని చెబుతాడు. తనకు రెండో భార్య రుక్మిణి, అజయ్ అనే కుమారుడు ఉన్నారని వెల్లడిస్తాడు.

వారిని చూడాలన్న తండ్రి చివరి కోరికను తీర్చేందుకు శశిధర్ శ్రీకంఠపురం వెళ్లి రుక్మిణి, అజయ్‌లను ఇంటికి తీసుకొస్తాడు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

భరత్ నాయుడు ఊహించని విధంగా కోలుకుంటాడు. దీంతో రెండో కుటుంబాన్ని ఏం చేయాలో శశిధర్‌కు అర్థం కాదు. వారిని ఇంట్లోనే రహస్యంగా ఉంచుతాడు. ఎందుకంటే వాళ్లు ఆస్తిలో వాటా అడుగుతారనే భయం అతనిని వెంటాడుతుంది.

మరోవైపు మొదటి భార్య సరస్వతితో పెళ్లికి సరైన ఆధారాలు లేకపోవడం, రెండో భార్య రుక్మిణితో వివాహానికి పక్కా డాక్యుమెంట్లు ఉండటం శశిధర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

ఇక రుక్మిణి, అజయ్‌ల విషయం బయటకు రాకుండా శశిధర్ చేసే ప్రయత్నాలు, ఇంట్లో జరిగే గందరగోళం సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా అరుణ్, అజయ్‌లను ట్విన్స్‌గా చూపిస్తూ వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తుంది.

ఆస్తి, కుటుంబ సంబంధాలు, మనుషుల స్వభావం చుట్టూ దర్శకుడు కథను నడిపించాడు. ఆస్తుల కంటే బంధాలు, అనుబంధాలే ముఖ్యమనే సందేశాన్ని కూడా అందించాడు.

సైజు కురుప్‌తో పాటు సాయికుమార్, ఇతర నటీనటుల నటన ఆకట్టుకుంటుంది. కథ, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ఓటీటీలో సరదాగా చూడదగిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

మలయాళ నటుడు సైజు కురుప్ విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ‘భరత్ నాట్యం’ 2024 ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైంది. కామెడీ…