subhodayam › గణేశ్ నిమజ్జనానికి వెళ్లి.. ఆరుగురు విద్యార్థులు మృతి › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

గణేశ్ నిమజ్జనానికి వెళ్లి.. ఆరుగురు విద్యార్థులు మృతి

subhodayam

సంగారెడ్డి జిల్లాలో గణేశ్ నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం పెదకంజర్ల గ్రామ శివారులోని నేరేడు చెరువులో ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

వినాయక విగ్రహ నిమజ్జనం కోసం విద్యార్థులు చెరువు వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు కొందరు నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు నిర్వహించి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులను నర్సింహ రాజు, సుమంత్, గణేశ్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్ధార్థ్గా గుర్తించారు. ఈ ఘటనతో పెదకంజర్లతో పాటు పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘటనపై సీఎం స్పందన

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జనాల సమయంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో గణేశ్ నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం పెదకంజర్ల గ్రామ శివారులోని నేరేడు చెరువులో ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా శిరీష…