subhodayam › RRB JE అభ్యర్థులకు అలర్ట్.. అక్టోబర్ 27 నుంచి CBT-1… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

RRB JE అభ్యర్థులకు అలర్ట్.. అక్టోబర్ 27 నుంచి CBT-1 పరీక్షలు

subhodayam
RRB JE అభ్యర్థులకు అలర్ట్.. అక్టోబర్ 27 నుంచి CBT-1 పరీక్షలు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB కీలక ప్రకటన చేసింది. జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి నిర్వహించే CBT-1 పరీక్షల తేదీలను ప్రకటించింది.

అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 4,029 పోస్టులను భర్తీ చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు 111 పోస్టులు కేటాయించారు.

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13తో ముగిసింది. దరఖాస్తుల్లో తప్పులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు సవరణ చేసుకునే అవకాశం ఉంది.

పరీక్షకు ముందు అభ్యర్థులకు RRB కీలక సమాచారాన్ని అందించనుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ పరీక్షకు 10 రోజుల ముందు, అడ్మిట్ కార్డు 4 రోజుల ముందు విడుదల కానుంది.

అభ్యర్థుల ఎంపిక స్టేజ్-1 CBT, స్టేజ్-2 CBT, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. తుది ఎంపికకు అన్ని దశల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

పరీక్ష తేదీలు, సిటీ స్లిప్, అడ్మిట్ కార్డు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్ల కోసం అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలని సూచించారు.

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB కీలక ప్రకటన చేసింది. జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల…