subhodayam › యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌.. బ్యాంకులకు భారీ ఆదాయం! › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌.. బ్యాంకులకు భారీ ఆదాయం!

subhodayam
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌.. బ్యాంకులకు భారీ ఆదాయం!

యూపీఐ లావాదేవీలపై వచ్చే నెల 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్‌) వసూలు చేయడం ద్వారా బ్యాంకులకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ బెర్న్‌స్టీన్ అంచనా వేసింది.

బెర్న్‌స్టీన్ అంచనాల ప్రకారం.. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ ద్వారా ఏటా సుమారు రూ.27 వేల కోట్ల (2.8 బిలియన్ డాలర్లు) అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 60 శాతం వాటా బ్యాంకులకు దక్కుతుందని పేర్కొంది.

అత్యధిక సేవింగ్స్ ఖాతాలు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఆదాయంలో సుమారు 25 శాతం వాటాను పొందే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ అంచనా వేసింది.

యూపీఐ వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎండీఆర్‌ విధానం బ్యాంకుల ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణ పేర్కొంది.

యూపీఐ లావాదేవీలపై వచ్చే నెల 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్‌) వసూలు చేయడం ద్వారా బ్యాంకులకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ…