మల్లన్న కాలనీలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అయితే కాలనీలో బస్తీ దవాఖాన లేకపోవడంతో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సైతం స్థానికులు ప్రైవేట్ ఆర్‌ఎంపీ డాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇదే అదనుగా ఆర్‌ఎంపీ డాక్టర్లు వైద్యం పేరుతో ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలు, వలస కార్మికులు ఎక్కువగా నివసించే మల్లన్న కాలనీలో ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి కాలనీలో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుకుంటున్నారు...