ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరోసారి పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన కొత్త సమీకరణాలకు స్థానిక సంస్థల ఎన్నికలు మరో పరీక్షగా మారనున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు మాత్రం ఆలస్యం చేయకుండా క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. స్థానికంగా బలమైన నాయకులను గుర్తించడం, క్యాడర్‌ను యాక్టివ్ చేయడం, సామాజిక సమీకరణాలను అంచనా వేయడం వంటి అంశాలపై పార్టీల దృష్టి పెడుతోంది.

కూటమికి లోకల్ ఎలక్షన్స్ కీలకం
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూటమికి కీలకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్థానిక స్థాయిలోనూ కొనసాగించగలమా? అనేది ఈ ఎన్నికల ద్వారా తేలనుంది.
కూటమి పార్టీలు రాష్ట్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది. ఒక్కో గ్రామం, మండలం, పట్టణంలో పార్టీ బలాబలాలు వేర్వేరుగా ఉండటంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
టీడీపీకి సంప్రదాయంగా బలమైన ప్రాంతాల్లో ఆ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. అదే సమయంలో జనసేన కూడా తన ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
జనసేన భవిష్యత్‌పై ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు మరో కోణంలో కూడా ముఖ్యమైనవిగా మారుతున్నాయి. పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని జనసేన నాయకత్వం భావిస్తోంది.
పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడంతో పాటు.. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెంచుకోవాలని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత బలపడాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే దిశలో చర్చకు దారితీశాయి. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసే స్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలనే లక్ష్యం ఉందని ఆయన చెప్పడం జనసేన విస్తరణ వ్యూహంపై ఆసక్తిని పెంచింది.
బీజేపీకి కూడా మంచి అవకాశం
ఏపీలో బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికలు తమ క్యాడర్‌ను మరింత విస్తరించుకునే అవకాశంగా మారనున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. పార్టీకి సొంతంగా బలం ఉన్న ప్రాంతాల్లో తన ఉనికిని చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది.
గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా స్థానిక స్థాయిలో సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు భవిష్యత్‌లో పార్టీ విస్తరణకు ఉపయోగపడతాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
వైసీపీకి కీలక సమరం
మరోవైపు వైసీపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పార్టీ.. స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా తన క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది.
ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకత్వం కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. స్థానిక సమస్యలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖపై ప్రత్యేక దృష్టి
విశాఖలో వైసీపీ స్థానిక ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకుంటోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరి
