సెప్టెంబర్ 17 చరిత్రను వక్రీకరించొద్దు.. తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగుతుంది: కవిత
తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగాల చరిత్రకు నిదర్శనమని కవిత అన్నారు. అయితే ఈ చారిత్రక రోజుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భిన్నమైన ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు.

తెలంగాణ విలీనం కేవలం స్టేట్ కాంగ్రెస్ పోరాటం వల్లే జరిగిందన్న వాదన సరైంది కాదని కవిత పేర్కొన్నారు. అప్పట్లో సంస్థానాల్లో పోరాటం చేయడం కాంగ్రెస్ విధానం కాదని మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నిజాం పాలనలో పేదలకు ఇచ్చిన భూముల విషయంలోనూ కాంగ్రెస్‌పై ఆమె ఆరోపణలు చేశారు.
మరోవైపు సెప్టెంబర్ 17 పోరాటాన్ని కేవలం మతపరమైన కోణంలో చూడటం సరికాదని కవిత అన్నారు. ముస్లిం పాలకుడిపై హిందువులు చేసిన పోరాటంగా చరిత్రను చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె విమర్శించారు. నాటి పోరాటంలో హిందువులు, ముస్లింలు సహా వివిధ వర్గాల ప్రజల
