బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మరోసారి ప్రేక్షకులను అలరించగా.. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు వైవిధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. సెలబ్రిటీలతో పాటు ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు.
గ్రాండ్ లాంచ్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారి నేపథ్యం, ఎంట్రీ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు..
దేబ్జానీ మోదక్: సీరియల్ నటిగా గుర్తింపు పొందిన దేబ్జానీ.. డ్యాన్స్‌తో హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు.
త్రిగుణ్: అదిత్ అరుణ్‌గా సినిమాల్లో నటించిన ఆయన.. పేరు మార్చుకుని త్రిగుణ్‌గా బిగ్ బాస్‌లోకి వచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే తన లక్ష్యమని చెప్పారు.
ఝాన్సీ: సింగర్‌గా గుర్తింపు పొందిన ఝాన్సీ గోల్డెన్ టికెట్‌తో హౌస్‌లోకి ప్రవేశించారు.
సుధీర్ రెడ్డి: ‘సుధీర్ టాక్స్’ పేరుతో పాడ్‌కాస్ట్‌ల ద్వారా పాపులర్ అయిన ఆయన.. తన జీవితంలోని కష్టాలను షేర్ చేసుకున్నారు.
అమన్: ‘అగ్నిపరీక్ష’లో అత్యధిక ఓట్లు సాధించి బిగ్ బాస్ ఛాన్స్ దక్కించుకున్నారు. గేమ్‌లో తాను ఫ్లిప్ అవ్వనని ధీమా వ్యక్తం చేశారు.
చైత్ర రాయ్: ‘అష్టాచమ్మా’లో స్వప్నగా గుర్తింపు తెచ్చుకున్న చైత్ర.. ట్రోలింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని 20 కిలోలు తగ్గిన విషయాన్ని వెల్లడించారు.
ఆటో రామ్ ప్రసాద్: జబర్దస్త్ కామెడీతో పాపులర్ అయిన రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్‌తో హౌస్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

షాలిని: జ్యూరీ సభ్యుడు నవీన్ ఎంపిక చేసిన షాలిని.. తన మాటలతోనే నాగార్జునను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
టెంపర్ వంశీ: సినిమాల్లో విలన్‌గా కనిపించిన వంశీ.. బిగ్ బాస్‌లో తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు.
సృష్టి వ్యాకరణం: శ్రీముఖి ఎంపిక చేసిన సృష్టి.. తన సంకల్పమే తన బలమని చెబుతూ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
పొట్టి నరేశ్: జబర్దస్త్ ఫేమ్ నరేశ్.. బిగ్ బాస్ ద్వారా తన పేరును మరింత పాపులర్ చేసుకోవాలనే లక్ష్యంతో వచ్చారు.
ఆర్జే చరణ్: ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎంపికైన చరణ్.. నవ్వించడం తన బలమని చెప్పారు.
కృష్ణుడు: ‘హ్యాపీ డేస్’, ‘వినాయకుడు’ చిత్రాలతో గుర్తింపు పొందిన కృష్ణుడు.. తన బరువు, వ్యక్తిగత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వర్షిణి సౌందరరాజన్: యాంకర్, నటిగా గుర్తింపు పొందిన వర్షిణి.. చివరకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
రోహిత్: బిందు మాధవి ఎంపిక చేసిన సామాన్య కంటెస్టెంట్ రోహిత్.. తొలి టాస్క్‌లోనే తన నిర్ణయంతో ప్రత్యేకంగా నిలిచారు.
ముఖేశ్ గౌడ: ‘గుప్పెడంత మనసు’లో రిషి పాత్రతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముఖేశ్ గౌడ.. 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు తన గుండెల్లో ఉందంటూ ప్రేక్షకుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు.
టైటిల్ ఎవరిది?
మొత్తంగా 16 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైంది. వేర్వేరు రంగాలు, విభిన్న వ్యక్తిత్వాలతో ఉన్న వీరంతా ఒకే ఇంట్లో సుమారు వంద రోజుల పాటు కలిసి ఉండనున్నారు. మరి ఈ ప్రయాణంలో ఎవరు తమ గేమ్‌తో ఆకట్టుకుంటారు? ఎవరు టాస్కుల్లో దూసుకెళ్తారు? చివరకు బిగ్ బాస్ సీజన్ 10 టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారో చూడాలి.
