తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బ్లాక్ డ్రెస్‌లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమను అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు నేతలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
పరిస్థితి అదుపు తప్పడంతో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో పలువురు పార్టీ నేతలకు గాయాలైనట్లు బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
మరోవైపు హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, వివేకానందరెడ్డి సహా పలువురు నేతలు టీషర్టులు విప్పేసి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని వారు నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించకుండా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
టీషర్టులు ధరించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడాన్ని కూడా బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ టీషర్ట్ ధరిస్తే ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు తమ విషయంలో ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని నిలదీశారు.

పిల్లలకు ఉద్యోగాలు అడిగితే విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఇదేం పాలన అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ నేతల నిరసన, పోలీసుల చర్యలతో అసెంబ్లీ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
