హైదరాబాద్‌లో రోజూ బస్సు, మెట్రోలో ప్రయాణించే వారికి త్వరలో భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ, మెట్రో సేవలకు ఉమ్మడి పాస్ విధానం అందుబాటులోకి రానుంది.
ఈ విధానం అమల్లోకి వస్తే ఒకే పాస్‌తో ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో ప్రతిసారీ వేర్వేరు టికెట్లు తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది.
నిత్యం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, నగరంలో తరచూ ప్రయాణించే వారికి ఈ ఉమ్మడి పాస్ విధానం ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. అంతేకాకుండా ప్రయాణ ఛార్జీల భారం కూడా తగ్గే అవకాశం ఉండటంతో ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.

