18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్ ఆయనకు స్వాగతం పలికారు.
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పెజెష్కియాన్ పాల్గొననున్నారు. భారత్–ఇరాన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, చబహార్ పోర్టు అభివృద్ధి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఇరాన్ భావిస్తున్నాయి.
గత నెలలో ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, పెజెష్కియాన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించారు. సమస్యలను దౌత్య, చర్చల మార్గంలో పరిష్కరించుకోవాలన్నది భారత్ విధానమని మోదీ పేర్కొన్నారు.

